చేతులెత్తి మెుక్కినా వేధించడం దుర్మార్గం: మంత్రి కొడాలి నానికి డొక్కా కౌంటర్

By Nagaraju penumalaFirst Published Sep 17, 2019, 4:53 PM IST
Highlights


కోడెల మృతిపై రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. కోడెలకు స్పీకర్ పదవి ఇచ్చి చంద్రబాబు అవమానించారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్పీకర్‌ పదవి అంటే మీకు అంత చులకనా? అంటూ నిలదీశారు. 
 

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఏపీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. కోడెల మృతిపై దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. 

కోడెల మృతిపై రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. కోడెలకు స్పీకర్ పదవి ఇచ్చి చంద్రబాబు అవమానించారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్పీకర్‌ పదవి అంటే మీకు అంత చులకనా? అంటూ నిలదీశారు. 

కోడెలకు స్పీకర్ పదవి ఇవ్వడం అవమానించడమా? అని నిలదీశారు డొక్కా మాణిక్య వరప్రసాద్. స్పీకర్ పదవి చాలా ఔన్నత్యమైనదని కూడా తెలియదా అంటూ నిలదీశారు. అలా అయితే తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇవ్వడం అవమానించడమేనా అంటూ కొడాలి నానిని  నిలదీశారు. 

తమ ప్రశ్నలకు కొడాలి నాని ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. స్పీకర్‌ పదవిని చులకన చేసి మాట్లాడిన కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఫర్నీచర్ కేసు కోడెలను ఎంతో కృంగదీసిందని ఆరోపించారు. 

కోడెల కుటుంబ సభ్యులు చేతులెత్తి మొక్కినా వేధించటం దుర్మార్గమంటూ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వ మానసిక వేధింపుల వల్లే కోడెల చనిపోయారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. 
 
ఇకపోతే కోడెలకు ఇబ్బందులెదురైతే చంద్రబాబు పట్టించుకోలేదని మీడియా సమావేశంలో కొడాలి నాని ఆరోపించారు. వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా చంద్రబాబు కోడెలపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇంత చేసినా తనను పట్టించుకోలేదని కోడెల మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని కొడాలి నాని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ అండగా లేకపోవడం వల్లే కోడెల కుంగిపోయారు: శ్రీకాంత్ రెడ్డి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!