బెజవాడలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

By Siva KodatiFirst Published Sep 17, 2019, 4:32 PM IST
Highlights

విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. బెజవాడ వన్‌టౌన్‌లోని చిట్టినగర్, వాగు సెంటర్ తదిర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది

విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. బెజవాడ వన్‌టౌన్‌లోని చిట్టినగర్, వాగు సెంటర్ తదిర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది.

దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు వర్షం కారణంగా భారీ ఈదురుగాలులు వీయడంతో గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దీంతో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఓ ప్రైవేట్ విమానంలో గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఉన్నారు. 

click me!