కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

By narsimha lodeFirst Published Oct 1, 2018, 10:46 AM IST
Highlights

వారం రోజుల క్రితం విశాఖ జిల్లా అరకులో  మావోయిస్టుల చేతిలో  హత్యకు గురైన  ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమల హత్యలో  ఇద్దరు కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. 
 


అరకు: వారం రోజుల క్రితం విశాఖ జిల్లా అరకులో  మావోయిస్టుల చేతిలో  హత్యకు గురైన  ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమల హత్యలో  ఇద్దరు కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. 

అయితే  ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరరావుకు  అత్యంత నమ్మకంగా ఉంటున్న  ఇద్దరే మావోలకు  ఎమ్మెల్యే కదలికల సమాచారాన్ని ఇచ్చారని పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

 గతంలో  కూడ మావోయిస్టులు ఎమ్మెల్యేను హత్య చేసేందుకు చేసిన ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే  తన పర్యటనను వాయిదా వేసుకోవడంతోనే మావోల ప్లాన్ సక్సెస్ కాలేదు.

అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావును హత్య చేయాలని  మావోలు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారని పోలీసులు  విచారణలో గుర్తించారు.  ఘటన జరగడానికి ముందుగా కొన్ని కొత్త ఫోన్ నెంబర్లకు  ఫోన్ కాల్స్ వెళ్లిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫోన్ నెంబర్లు ఎవరెవరివి అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

కిడారి సర్వేశ్వరరావును హత్య చేయడానికి గాను ఇద్దరు వ్యక్తుల సహకారాన్ని మావోలు తీసుకొన్నారని  పోలీసులు గుర్తించారు.  స్థానిక ఒక ఎంపీటీసి సభ్యుడితో పాటు  గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తితో  మావోలు సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడిని మావోలు పిలిపించుకొని  మాట్లాడారు.  తర్వాత కూడ మండలస్థాయి నాయకుడితో కూడ మావోలు  భేటీ అయ్యారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గ్రామాల్లోకి ఎప్పుడు వస్తారనే సమాచారాన్ని తమకు అందించాలని  మావోలు టీడీపీ నేతలకు సూచించారు. 

సెప్టెంబరు 19న గ్రామదర్శినికి రావాలని ఎమ్మెల్యేను ఆ నాయకుడు ఆహ్వానించాడు. స్థానిక నేతల  ఆహ్వానాన్ని ఎమ్మెల్యే అంగీకరించాడు. ఈ విషయాన్ని ఆ నేత మావోలకు చేరవేశాడు. దీంతో మావోలు రెండు రోజుల ముందేతమ వ్యూహాన్ని సిద్దంచేసుకొనే ప్రయత్నం చేశాయి.  అయితే ఆదే సమయంలో  ఎమ్మెల్యే సతీమణి 
అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చి ఆయన రాలేక పోయారు. దీంతో మావోయిస్టుల ప్లాన్‌ అప్పుడు ఫలించలేదు.

దీంతో సెప్టెంబర్ 23వ తేదీన మరోసారి వస్తానని కిడారి సర్వేశ్వరరావు స్థానిక నేతలకు హామీ ఇచ్చాడు. లివిటిపుట్టు వద్ద  మావోలు కిడారి సర్వేశ్వరరావు వాహానాన్ని నిలిపి హత్య చేశారు. 
 
 కిడారి, సివేరి హత్య విషయం తెలియగానే సోమ అనుచరులను ఓ గంజాయి స్మగ్లర్‌ రెచ్చగొట్టాడు. పోలీసులు నిత్యం మనల్ని ఇబ్బంది పెడుతూ.. చివరకు మన నాయకులను కూడా మావోయిస్టుల నుంచి రక్షించలేకపోయారని దాడికి పురిగొల్పాడు.

సంబంధిత వార్తలు

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

click me!