వేకువ జామున పవన్ కల్యాణ్ రహస్య పూజలు

Published : Oct 01, 2018, 10:38 AM IST
వేకువ జామున పవన్ కల్యాణ్ రహస్య పూజలు

సారాంశం

పవన్ కల్యాణ్ అసలు రహస్యంగా పూజలు ఎందుకు చేశారనే విషయం తెలియడం లేదు. ఆలయంలోనే పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం చేశారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాధపురంలోని నరసింహస్వామి ఆలయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ రహస్యంగా పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4.30 వరకు ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ అసలు రహస్యంగా పూజలు ఎందుకు చేశారనే విషయం తెలియడం లేదు. ఆలయంలోనే పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం చేశారు.

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ సోమవారం ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన మండలాల్లో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురి అవుతున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని పోలవరం నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు.

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations