జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

By narsimha lodeFirst Published Feb 3, 2019, 12:55 PM IST
Highlights

పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్  హత్య కేసులో ఇంకా తేలాల్సిన ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. జయరామ్‌ హత్యకు గురి కావడానికి ముందు ఎక్కడెక్కడ ఉన్నాడనే  విషయమై పోలీసులు శాస్త్రీయంగా  ఆధారాలను సేకరిస్తున్నారు.

హైదరాబాద్: పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్  హత్య కేసులో ఇంకా తేలాల్సిన ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. జయరామ్‌ హత్యకు గురి కావడానికి ముందు ఎక్కడెక్కడ ఉన్నాడనే  విషయమై పోలీసులు శాస్త్రీయంగా  ఆధారాలను సేకరిస్తున్నారు. నాలుగున్నర కోట్ల కోసమే రాకేష్ రెడ్డి జయరామ్‌ను హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్యకు ముందు హైద్రాబాద్‌లో జయరామ్ గడిపిన ప్రాంతాల్లో  సీసీటీవి పుటేజీని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  హైద్రాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌తో పాటు హైద్రాబాద్‌లోని మరో హోటల్‌లో కూడ జయరామ్  గడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ రెండు హోటల్స్‌ నుండి సీసీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

ఓ హోటల్‌లో జయరామ్ ఉన్న సమయంలో ఆయనను ఓ యాంకర్ కలిశారని  పోలీసులు గుర్తించారు. మరో వైపు  ఇదే సమయంలో రాకేష్ రెడ్డి  బృందం ఈ హోటల్ రూమ్‌కు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ హోటల్‌ నుండే జయరామ్‌తో పాటు రాకేష్ రెడ్డి కారులో విజయవాడ వైపు బయలుదేరినట్టు పోలీసులు గుర్తించారు.

రాకేష్ రెడ్డికి నాలుగున్నర కోట్ల రూపాయాల అప్పు విషయమై ప్రతి నెల వడ్డీని చెల్లించేవారు. శిఖా చౌదరి ఈ అప్పును తీసుకొందని అంటున్నారు. అయితే గత నెలలో ఈ డబ్బులకు వడ్డీ చెల్లించలేదు. ఈ విషయమై రాకేష్ రెడ్డి శిఖా చౌదరి ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని చెబుతున్నారు. 

అయితే ఈ డబ్బుల కోసమే రాకేష్ రెడ్డి  జయరామ్‌ను హత్య చేశారని చెబుతున్నారు. అయితే కారులోనే జయరామ్ ను  హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే జయరామ్‌కు  విషం ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అనుమానాలను కూడ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే  ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ మేరకు జయరామ్ శరీరం నుండి  సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు.

కుక్కకు ఇచ్చే పాయిజన్‌ను జయరామ్‌కు ఇచ్చినట్టు పోలీసుల అనునానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుక్కలకు ఇచ్చే ఇథునేషియా ఇంజెక్షన్ ను జయరామ్‌ కు ఇచ్చి ఉంటారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.  జయరామ్ శాంపిల్స్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

జయరామ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి వెళ్లారు. ఆయన ఇంట్లో కొన్ని డాక్యుమెంట్ల కోసం  గాలించారు. అయితే జయరామ్ ఇంటి వాచ్‌మెన్ శిఖాచౌదరి, రాకేష్ రెడ్డిని అడ్డగించారు.  అయితే  ఎందుకు శిఖా చౌదరి  జయరామ్ ఇంటికి వచ్చిందనే  విషయమై  పోలీసులు కూడ ఆరా తీస్తున్నారు.

రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి పోన్ కాల్స్ డేటాతో పాటు జయరామ్ కాల్ డేటా ను కూడ పోలీసులు సేకరించారు. శాస్త్రీయంగా ఆధారాలను సేకరిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా, రాకేష్ రెడ్డి , శిఖా చౌదరి సెల్‌ టవర్ లోకేషన్ ఆధారంగా కూడ దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

 

click me!