Pawan Kalyan New Year Wishes: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షాలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నూతనం… ప్రారంభం.. ఆరంభం.. అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిండి ఉంటుందని… అటువంటిది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుందని పవన్ పేర్కొన్నారు.