ఇప్పటికే ‘రిపబ్లిక్’పంక్షన్ లో తాను మాట్లాడిన దాని వలనే సమస్య ఇంత పెద్దదైందనే వాదన పవన్ వద్దకు చేరే ఉంటుంది. ఈ దిశగా ఇప్పటికే ఇండస్ట్రీ నుండి పవన్ కు రిక్వెస్ట్ లు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అంటే వైసీపీ ఎంతగా విమర్శలు చేసినా, రెచ్చగొట్టినా, టికెట్ ధరలపై స్పందించకుండా కొద్ది కాలం పవన్ ఆగుతారన్నమాట.