Asianet News TeluguAsianet News Telugu

నూతనం… ప్రారంభం.. ఆరంభం.. New Year Whises చెప్పిన Pawan Kalyan

Pawan Kalyan New Year Wishes: తెలుగు రాష్ట్రాల ప్రజలకు  నూతన సంవత్సర శుభాకాంక్షాలు తెలిపారు జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్. నూతనం… ప్రారంభం.. ఆరంభం.. అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిండి ఉంటుందని… అటువంటిది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుందని పవన్ పేర్కొన్నారు. 
 

janasena chief pawan kalyan new year wishes
Author
Hyderabad, First Published Dec 31, 2021, 11:55 PM IST

Pawan Kalyan New Year Wishes:  మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రానున్న‌ది. ఈ క్ర‌మంలో ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో న్యూఇయ‌ర్ కు ఘనంగా స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టిగా.. పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా ద్వీపం 2022లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే న్యూ ఇయ‌ర్ ప్రారంభ‌మ‌వుతోంది.  

ఇదిలా ఉంటే..  ప్ర‌ముఖలు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయకులు న్యూ ఇయ‌ర్ విషెష్ తెలుపుతోన్నారు. ఈ నేపథ్యంలో జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, త‌న ట్విట్ట‌ర్ ఖాతా వేదిక‌గా.. తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను శుభాకాంక్ష‌లు అందించారు.  "నూతనం... ప్రారంభం.. ఆరంభం.. కొత్త ఆనే పదాలలోనే ఒక ఉత్తేజం నిబిడీకృతమై ఉంటుంది. అటువంటిది మరి కొత్త సంవత్సరం అంటే..? ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు... లుూలతో సంగమమై మన ముందుకు తరలివస్తుంది. అలా మన ముందు ఆవిష్క్పృతనువుతున్న 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితోపాటు భారతీయులందరికీ నా తరపున, జనస్‌న పార్టీ తరఫున ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 

గడచిన రెండేళ్లలో కరోనా మహమ్మారి మానవాళిపై పైచేయి సాధించాలని చేసిన ప్రయత్నాలను మనమందరం అనుభవైక్యంగా చవిచూశాము. అయితే మానవాళి మనోనిబ్బరం, మనోవిజ్ఞానం ముందు కరోనా పలాయనం దిశగా ప్రయాణించడం లోక కళ్యాణంగా భావిస్తున్నాను. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు కరోనా వెళ్లిపోయే ముందు కూడా తన ప్రభావాన్ని చూపాలని ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకూ పాటించిన జాగురూకతతోనే మనం ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ ఆరోగ్యకరం, ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను. కరోనాతోపాటు అతివృష్టి రూపంలో ప్రకృతి కూడా కొంత ప్రకోపాన్ని ప్రదర్శించినా ప్రజల జీవన ప్రస్టానం అప్రతిహచంగా సాగిపోవడం సంతోషకరమైన Telanganaలో ఏరులై పారుతోన్న మద్యం.. రికార్డు స్థాయిలో liquor అమ్మ‌కాలుపరిణామం.

Read Also :

ఈ వైపరీత్యాలతోపాటు కొందరు పాలకుల చిత్తదాపల్యం వల్ల కూడా కొన్ని ప్రాంతాలలో ప్రజలు బాధలుపడ్డారు.  ఈ నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విలసిల్లాలని, ఎటువంటి బాధలు లేకుండా ప్రజలకు సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను"  అంటూ ట్వీట్ చేశారు. 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ త‌న అభిమానాల‌కు శుభాకాంక్షలు తెలియ‌జేశారు పవన్ క‌ళ్యాణ్‌.

అలాగే... ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవ‌త్స‌రం అందరూ ఆనందోత్సాహాలతో గడపాలని, ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు వెల్లివిరియాలని  ఆకాంక్షించారు. త‌మ‌ తమ రంగాల్లో ఉన్నతస్థానం చేరుకోవాలని కోరుకున్నారు. కొత్త ఏడాదిలో యువతరం లక్ష్యాలు, కలలు నెరవేరాలని ఆశించారు. 
 
టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు ప్ర‌జ‌ల‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవ‌త్స‌రం..  తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ  అఖండ విజయం చేకూరాలని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని పేర్కొన్నారు. అందరికీ ఆయురారోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షిస్తున్నట్టు వివరించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios