మరో రీమేక్ పై పవన్ కళ్యాణ్ కన్నేశాడనేది కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త. గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం వినోదయ చిత్తం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రఖని దర్శకత్వం వహించి... ప్రధాన పాత్ర చేశారు. ఈ మూవీని రీమేక్ చేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
యాంటీ ఫ్యాన్స్ ఎన్ని విమర్శలు చేసినా రీమేక్స్ ఆపడం లేదు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). పాలిటిక్స్ కోసం సినిమాల నుండి మూడేళ్లు బ్రేక్ తీసుకున్న పవన్, కమ్ బ్యాక్ రీమేక్ తోనే ఇచ్చారు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కిన విషయం తెలిసిందే. పవన్ నటించిన మరో రీమేక్ భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధం ఉంది. భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి అధికారిక రీమేక్.
కాగా మరో రీమేక్ పై పవన్ కళ్యాణ్ కన్నేశాడనేది కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త. గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం వినోదయ చిత్తం (Vinodaya chittam)మంచి విజయాన్ని అందుకుంది. సముద్రఖని దర్శకత్వం వహించి... ప్రధాన పాత్ర చేశారు. ఈ మూవీని రీమేక్ చేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి ఉన్న మరొక ప్రత్యేకత మల్టీస్టారర్ కావడం. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ కలిసి నటించనున్నారట. ఈ చిత్రం అధికారికమే అయితే దర్శకుడు త్రివిక్రమ్ కి తిప్పలే అంటున్నారు.
వినోదయ చిత్తం మూవీ రీమేక్ హక్కులు జీ స్టూడియోస్ సంస్థ దగ్గర ఉన్నాయట. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో భాగమైతేనే అడుగు ముందుకు వేయాలని ఆ సంస్థ భావిస్తోందట. అలాగే ఈ చిత్రాన్ని పవన్ తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. నిర్మాణ భాగస్వామ్యం లేకుండా త్రివిక్రమ్ వినోదయ చిత్తం చిత్రానికి పనిచేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇది త్రివిక్రమ్ కి చెందిన నిర్మాణ సంస్థ. దీంతో భీమ్లా నాయక్ చిత్రానికి అన్నీ తానై చూసుకుంటున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయడంతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఇదే స్థాయిలో వినోదాయ చిత్తం చిత్రానికి త్రివిక్రమ్ సహకారం ఉంటుందని చెప్పలేం. కారణం ఆయన మహేష్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ నుండి ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
భీమ్లా నాయక్ సమయంలో ఖాళీగా ఉన్నారు, అలాగే ఆ మూవీలో భారీగా వాటా పొందారు. అయితే పవన్ కోరితే త్రివిక్రమ్ (Trivikram) కాదనరు. అంత గొప్ప బాండింగ్ ఇద్దరి మధ్య ఉంది. కాబట్టి త్రివిక్రమ్ తప్పుకునే ఛాన్స్ లేదు. ఇది త్రివిక్రమ్ ని ఇరకాటంలో పడేసే వ్యవహారమని కచ్చితంగా చెప్పగలం. అటు పవన్ కళ్యాణ్ ని కాదనలేక, ఇటు మహేష్ మూవీ పనులు చూసుకోలేక ఇబ్బంది పడనున్నారనిపిస్తుంది.
కాగా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన వకీల్ సాబ్ ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల కానుంది. థియేటర్స్ పై కరోనా ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే చిత్రాలు విడుదల కానున్నాయి. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ రోల్ చేస్తున్నారు. రానా మరో హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
