గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే.. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తెలుస్తున్నది. బీజేపీకి, కాంగ్రెస్ కూటమి 16 చొప్పున సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు అంచనాలు వేశాయి. కాగా, మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కింగ్ మేకర్‌గా మారే ఛాన్స్ ఉన్నది.