Asianet News TeluguAsianet News Telugu

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఐ మద్దతుకు టీఆర్ఎస్ యత్నాలు

హుజూర్‌నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతును టీఆర్ఎస్ కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీతో టీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. 

Trs plans to  ask cpi support in huzurnagar bypoll
Author
Huzurnagar, First Published Sep 29, 2019, 3:13 PM IST


హైదరాబాద్: హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి  ఈ ఏడాది అక్టోబర్ 21న జరిగే ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని  సీపీఐను కోరాలని టీఆర్ఎస్  నిర్ణయం తీసుకొంది.

ఆదివారం నాడు సీపీఐ  రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి టీఆర్ఎస్ నేతలు  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని  కోరనున్నారు. టీఆర్ఎస్ నేతలు కె. కేశవరావు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మెన్  బోయినపల్లి వినోద్ కుమార్ లు సీపీఐ నేతలతో భేటీ కానున్నారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ  స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  సీపీఐ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, టీడీపీ కలిసి పోటీ చేశాయి.

అయితే ఈ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పోటీకి సీపీఐ దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు.ఈ తరుణంలో హుజూర్‌నగర్ లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని  సీపీఐ నేతలను టీఆర్ఎస్ కోరనుంది.

ఈ నియోజకవర్గంలో  సీపీఎం, సీపీఐకు పట్టుంది. ఈ తరుణంలో సీపీఐ మద్దతును టీఆర్ఎస్ ను కోరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఓటమి భయంతోనే సీపీఐ మద్దతు కోరాలని  టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొందని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కమ్యూనిష్టులను అవమానపర్చేలా మాట్లాడిన కేసీఆర్ కు ఇప్పుడు కమ్యూనిష్టులు ఎలా గుర్తుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు:

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్లే.. లక్ష్మణ్ వ్యాఖ్యలు

కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకాకి

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios