Asianet News TeluguAsianet News Telugu

Hyderabad Lok Sabha : బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఒక్క హగ్ ... ఎంతపని చేసింది...!

ఎలక్షన్ కోడ్ అమల్లో వుంది... కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు తస్మాత్ జాగ్రత్త. లేదంటే ఈ హైదరాబాద్ పోలీస్ పరిస్థితే మీకు రావచ్చు. తెలిసీ తెలియక చేసిన చిన్న పోరపాటు మీ జాబ్ కే ఎసరు తేవచ్చు... 

Woman Police Suspended After hugs Hyderabad Lok Sabha BJP Candidate Madhavi Latha AKP
Author
First Published Apr 23, 2024, 12:48 PM IST

హైదరాబాద్ : మాధవీలత ... తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు సంచలనం. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీదే హవా... అక్కడ అత్యధికంగా ముస్లిం జనాభా వుండటంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా వెనకుడుగు వెస్తుంటాయి. అలాంటిది ఓ మహిళ హిందుత్వ పార్టీగా ముద్రపడిన బిజెపి పాతబస్తీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇలా హైదరాబాద్ లోక్ సభ పోటీచేస్తున్న మాధవీ లత ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాఫిక్. 
 
పాతబస్తీలో ఎంఐఎం పార్టీని ఎదిరించి పోటీలో నిలవడమే కాదు ప్రచారాన్ని కూడా సరికొత్త రీతిలో చేపడుతున్నారు మాధవీ లత. ఈ క్రమంలో ఆమె వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల మసీదువైపు విల్లు ఎక్కుపెట్టినట్లుగా ఆమె ఫోజులివ్వడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఇది మరిచిపోకముందే మరో వివాదం రాజుకుంది. మాధవీలతను కలిసిన ఓ మహిళా పోలీస్ పై వేటు పడింది. 

అసలేం జరిగింది : 

హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు బిజెపి అభ్యర్థి మాధవీలత. హిందూ, ముస్లిం అని తేడాలేకుండా అందరినీ కలిసి పాతబస్తీలో మార్పు కోసం ఓటు వేయాలని కోరుతున్నారు. ఇలా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాధవీ లత ప్రచారం నిర్వహించారు. దీంతో స్థానిక ఏఎస్సై ఉమాదేవి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా సెక్యూరిటీ నిర్వహించారు. 

అయితే గతంలో పరిచయం వుందో లేక మహిళా పోలీస్ అన్న అభిమానంతోనే మాధవీ లత ఏఎస్సైని సరదాగా పలకరించారు. దీంతో ఉమాదేవి కూడా మాధవీలతతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఇద్దరూ కరచాలనం చేసుకుని ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఈ హగ్ సదరు మహిళా పోలీస్ ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. 

ఎన్నికల విధుల్లో వుండగా ఏ రాజకీయ పార్టీకి, నాయకులకు అధికారులు అనుకూలంగా వ్యవహరించకూడదు. కానీ ఎన్నికల కోడ్ ను ఉళ్లంఘించేలా సైదాబాద్ ఏఎఎస్స్ వ్యవహరించారంటూ ఈసికి, పోలీస్ ఉన్నతాధికారులను ఫిర్యాదులు అందాయి. మాధవీలతను పోలీస్ డ్రెస్ లో వున్న ఉమాదేవి ఆలింగనం చేసుకుంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో సదరు ఏఎస్సై ఉమాదేవిపై యాక్షన్ తీసుకున్నారు... ఆమెను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 

 

మాధవీ లత మరో వివాదం :

ఇటీవల దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు హట్టహాసంగా జరిగాయి. ఇలా హైదరాబాద్ లో కూడా రామనవమి సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో బిజెపి అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు. సిద్ది అంబర్ బజార్ మీదుగా భారీ ర్యాలీ సాగుతుండగా మాధవీలత శ్రీరామ బాణం ఎక్కుపెడుతున్నట్లు ఫోజ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే ఓ మసీదు వైపు ఆమె విల్లు ఎక్కుపెట్టినట్లుగా వుందంటూ ఓ సామాజికవర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసి కూడా రియాక్ట్ అయ్యారు. ఎన్నికల కోడ్ ను ఉళ్లంఘిస్తూ మత విద్వేశాలను రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ వ్యవహారంపై మాధవీ లత కూడా వివరణ ఇచ్చారు. తాను మసీదు వైపు విల్లు ఎక్కుపెట్టలేదు... ఓ భవనం వైపు వేస్తున్నట్లుగా నటించానంతే అని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే ఎంఐఎం మసీదు వైపు చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. యువతను రెచ్చగొట్టి వివాదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది ఓవైసి, ఎంఐఎం నాయకులేనని మాధవీలత అన్నారు. 

మాధవీలతపై కేసు నమోదు : 

ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా మాధవీలత వ్యవహరించారంటూ షేక్ ఇమ్రాన్ అనేవ్యక్తి బేగంబజార్ పోలీసులకు పిర్యాదు చేసాడు. దీంతో ఐపిసి 295-A, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 125(మత విశ్వాసాలను అవమానించడం, రెచ్చగొట్డడం) కింద కేసులు నమోదు చేసారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios