స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గరి నుంచి కాలేజికి వెళ్లే అమ్మాయిల వరకు గ్రీన్ స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా మంచి ఆప్షన్. గోల్డ్ బేస్‌పై పచ్చ రాయి కాంబినేషన్ చూడటానికి చాలా రాయల్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఇవి ఎలాంటి దుస్తులకైనా చక్కగా సెట్ అవుతాయి.
ఇయర్ రింగ్స్ అమ్మాయిల ముఖానికి అదనపు అందాన్ని తెచ్చి పెడతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ట్రెండీ డిజైన్ ఇయర్ రింగ్స్ స్టైల్ చేయాలి అనుకుంటారు. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లలు, కాలేజీ కి వెళ్లే అమ్మాయిల కోసం చెవి పోగులు కొనాలంటే తేలికగా, చర్మానికి సురక్షితంగా, చూడటానికి క్యూట్‌గా ఉండే డిజైన్లను ఎంచుకోవడం ముఖ్యం. అలాంటి వారికి గ్రీన్ స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్.
పచ్చ రంగు అమ్మాయిల ముఖానికి ఒక బ్రైట్‌నెస్ తీసుకొస్తుంది. ఇక గోల్డ్ బేస్ దీనికి యాంటిక్, రిచ్ ఫినిష్ ఇస్తుంది. ఈ జ్యువెలరీ పండగలకు, ఫంక్షన్లకు, ఫ్యామిలీ ఈవెంట్లకు, ఫోటోషూట్‌లకు చాలా అందంగా కనిపిస్తుంది. గోల్డ్ మీద గ్రీన్ స్టోన్ మెరుపు చక్కగా కనిపిస్తుంది. గోల్డ్ వార్మ్ టోన్‌పై గ్రీన్ కూల్ కలర్ సెట్ అయినప్పుడు, దాని లుక్ యాంటిక్‌గా, క్లాసిక్‌గా, చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని గ్రీన్ స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి.
డైలీ వేర్ కోసం గోల్డ్ మినీ గ్రీన్ స్టడ్స్
చాలామంది అమ్మాయిలకు ఈ స్టైల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ బాగా నచ్చుతాయి. చిన్న గోల్డ్ ఫ్రేమ్ మధ్యలో ఒక పచ్చ రాయి.. చూడటానికి సింపుల్‌గా ఉన్నా లుక్ మాత్రం ప్రీమియంగా ఉంటుంది.

అందమైన ఫ్లవర్ షేప్ గ్రీన్ స్టోన్ స్టడ్స్
ఫ్లవర్ డిజైన్లు ఎప్పుడూ క్యూట్ గా ఉంటాయి. ఇందులో బంగారు బేస్‌పై చిన్న చిన్న పచ్చ రాళ్లతో పువ్వు ఆకారాన్ని రూపొందిస్తారు. పండగలు, బర్త్‌డే పార్టీలు, ఫోటోషూట్‌లకు ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
యాంటిక్ టచ్‌తో ఓవల్ ఫ్రేమ్ వింటేజ్ గ్రీన్ స్టోన్
చూడటానికి చిన్నగా ఉన్నా రాయల్ పీస్‌లా కనిపించాలంటే, ఓవల్ గోల్డ్ ఫ్రేమ్‌లో ఉండే ఈ గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్ బెస్ట్. ఇవి ముఖానికి క్లాసీ లుక్ ఇస్తాయి. ఫ్యామిలీ ఫంక్షన్లు, పూజలు లేదా డ్రెస్ మ్యాచింగ్‌కి పెట్టుకుంటే ఫోటోల్లో అదిరిపోతుంది.

తేలికపాటి హ్యాంగింగ్స్‌తో పెయర్-షేప్ డ్రాప్ గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్
కిందకు వేలాడే జ్యువెలరీ ఇష్టపడే అమ్మాయిలకు ఈ స్టైల్ పర్ఫెక్ట్. టియర్ డ్రాప్ డిజైన్ లో ఉండే ఈ పచ్చ రాయి చిన్నగా ఉన్నా వెంటనే ఆకట్టుకుంటుంది. ఇది మోడ్రన్‌గా, ట్రెడిషనల్‌గా కూడా ఉంటుంది.

మినీ వెర్షన్ గ్రీన్ బీడ్ చాంద్‌బాలీ
చాంద్‌బాలీ ఎప్పుడూ యాంటిక్ జ్యువెలరీకి కేరాఫ్ అడ్రస్. గోల్డ్ బేస్‌పై ఒక చిన్న పచ్చ రాయి ఉంటుంది. ఇది ప్రత్యేక సందర్భాల కోసం పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ ఇయర్ రింగ్స్ ఫంక్షన్లు, పండగల్లో మీకు క్యూట్ లుక్ ఇస్తాయి.


