చేతులకు మెహందీ చాలా అందాన్ని ఇస్తుంది. కానీ, వాటిలో ఉండే కెమికల్స్ చేతులను డ్యామేజ్ చేస్తాయి. మరి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా, టీ పొడితో మెహందీ ఎలా తయారు చేయాలో  చూద్దామా.. 

టీ పొడితో మెహందీ ఎలా తయారు చేసుకోవాలి: ఇప్పుడు మార్కెట్లో దొరికే కెమికల్ మెహందీతో చేతులకు, జుట్టుకు మంచి రంగు వస్తుంది కానీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. స్కిన్ అలెర్జీలు, చేతులు డ్రై అవ్వడం జరుగుతుంది. అందుకే నేచురల్ మెహందీ వాడాలని చాలా మంది అనుకుంటారు. కానీ నేచురల్ మెహందీతో డార్క్ కలర్ రాదు. నేచురల్ మెహందీతో డార్క్ కలర్ కావాలంటే టీ పొడి వాడి ఇంట్లోనే మెహందీ రంగు పెంచుకోవచ్చు. ఈ మెహందీని చేతులకి, జుట్టుకి వాడుకోవచ్చు. టీ పొడితో మెహందీ తయారు చేసే విధానం ఇక్కడ ఉంది...

టీ పొడి మెహందీకి కావలసినవి

3–4 పెద్ద స్పూన్లు గోరింటాకు పొడి

1.5 కప్పుల నీళ్ళు

2 స్పూన్ల టీ పొడి

1 స్పూన్ కాఫీ పొడి

1/2 నిమ్మకాయ రసం

1 స్పూన్ ఆవనూనె లేదా యూకలిప్టస్ ఆయిల్

టీ పొడి మెహందీ తయారీ విధానం

ఒక పాన్ లో 1.5 కప్పుల నీళ్ళు తీసుకోండి.

అందులో 2 స్పూన్ల టీ పొడి, 1 స్పూన్ కాఫీ పొడి వేయండి.

నీళ్ళు చిక్కబడే వరకు 5-7 నిమిషాలు మరిగించాలి.

ఈ మిశ్రమాన్ని వడకట్టి చల్లారనివ్వండి.

ఒక గిన్నెలో 3-4 స్పూన్ల మెహందీ పొడి తీసుకోండి.

అందులో చల్లారిన టీ మిశ్రమాన్ని కలుపుతూ బాగా కలపాలి.

1/2 నిమ్మకాయ రసం, 1 స్పూన్ ఆవనూనె కలపండి.

మిశ్రమాన్ని చిక్కగా ఉండేలా కలిపి, 6-8 గంటలు (లేదా రాత్రంతా) మూత పెట్టి ఉంచండి.

టీ పొడి మెహందీ ఎలా వేసుకోవాలి

టీ పొడి మెహందీ తయారైన తర్వాత, ప్లాస్టిక్ షీట్ తీసుకుని కోన్ లాగా చేసి మెహందీ నింపండి. లేదా బ్రష్ తో చేతులకి అప్లై చేసుకోవచ్చు. ఆరిన తర్వాత నిమ్మరసం, పంచదార మిశ్రమం అప్లై చేయండి. మెహందీని 4-6 గంటలు లేదా రాత్రంతా ఉంచితే మంచి రంగు వస్తుంది.

టీ పొడి మెహందీ వల్ల ప్రయోజనాలు

టీ పొడి మెహందీ వల్ల డార్క్, బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఇది పూర్తిగా నేచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మెహందీని చేతులకి, జుట్టుకి కూడా వాడుకోవచ్చు. టీ పొడి, కాఫీ జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తాయి.