చియా సీడ్స్ ని చాలా మంది బరువు తగ్గడానికి తమ డైట్ లో భాగం చేసుకుంటారు. కానీ, అవే చియా సీడ్స్ మీ అందం పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.ముఖ్యంగా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.

 

అమ్మాయిలకు జుట్టు అంటే ఎంత ఇష్టం ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ సౌందర్యానికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో.. హెయిర్ కేర్ విషయంలోనూ అంతే తాపత్రయపడుతూ ఉంటారు. కానీ, ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఎంత ఖరీదైన క్రీములు, నూనెలు, షాంపూలు, కండిషనర్లు వాడినా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుందని ఫీలౌతూ ఉంటారు. మీరు కూడా జుట్టు పొడవుగా పెరగడం లేదని, జుట్టు రాలిపోతోందని ఫీలౌతూ ఉంటే కేవలం చియా సీడ్స్ వాడితే చాలు.

చియా సీడ్స్ ని చాలా మంది బరువు తగ్గడానికి తమ డైట్ లో భాగం చేసుకుంటారు. కానీ, అవే చియా సీడ్స్ మీ అందం పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.ముఖ్యంగా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.మరి.. ఈ చియా సీడ్స్ ని జుట్టు ఒత్తుగా పెరగడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చియా విత్తనాలతో హెయిర్ మాస్క్...

చియా విత్తనాలను ఉపయోగించి మనం ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, ముందుగా చియా సీడ్స్ ని ఒక గిన్నెలో నీటిలో నానపెట్టాలి. రాత్రంతా వీటిని అలానే నీటిలో నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నానపెట్టిన చియా సీడ్స్ ని మిక్సీలో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు చెంచాల పెరుగు, కొంత తాజా కలబంద జెల్ వేసి బాగా కలపాలి. అంతే.. మీ హెయిర్ మాస్క్ రెడీ అయినట్లే.

ఇప్పుడు మీ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది. మీరు దీన్ని మీ జుట్టుకు మంచిగా అప్లై చేయాలి. కనీసం 40 నిమిషాలు జుట్టుకు ఉంచాలి. సమయం ముగిసిన తర్వాత, మీరు తేలికపాటి షాంపూ సహాయంతో మీ జుట్టును కడగవచ్చు. గుర్తుంచుకోండి, ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. దీని నుండి మీరు చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఏదైనా ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి ఎందుకంటే అది కొంతమంది అమ్మాయిల చర్మంపై ప్రతిచర్యకు కారణం కావచ్చు.