రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కార్పెట్ ను ఇలా శుభ్రం చేయండి

చాలా రోజులు కార్పెట్ ను అలవాటే వాడితే మురికిగా మారుతుంది. అయితే దీన్ని చాలా ఈజీగా, రూపాయి ఖర్చు లేకుండా తొందరగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే? 

Carpet Cleaning Tips at Home rsl

ఆడవాళ్లే కాదు మగవారు కూడా తమ ఇంటిని అందంగా ఉంచుకోవాలనుకుంటారు. ఇందుకోసం చాలా మంది కార్పెట్ ను ఖచ్చితంగా వాడుతారు. ఈ కార్పెట్ వల్ల ఇంటి అందం అమాంతం పెరిగిపోతుంది. కార్పెట్ ను  ఇంట్లోని ఏ రూం లో పెట్టినా ఆ రూం ఎంత అందంగా కనిపిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో డిజైన్లలో, రంగుల్లో కార్పెట్ లు దొరుకుతున్నాయి. కార్పెట్ వల్ల ఇళ్లు అందంగా కనిపించినా దీనివల్ల ఒక సమస్య మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదేంటో కాదు.. పిల్లలు ఆడుకునేటప్పుడు,  చెప్పుల దుమ్ము వల్ల ఇవి తొందరగా మురికిగా మారిపోతాయి. అలాగే వీటి రంగు కూడా మసకగా అవుతుంది.

Carpet Cleaning Tips at Home rsl 

కానీ మరీ మురికిగా అయిన కార్పెట్ ను శుభ్రం చేయడం మాటలు కాదు. దీనికోసం చాలా కష్టపడాలి. అందుకే చాలా మంది దీన్ని అలాగే శుభ్రం చేయకుండా వదిలేస్తారు. కానీ మీరు రూపాయి ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా, తొందరగా దీన్ని శుభ్రం చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Carpet Cleaning Tips at Home rsl

వాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించి క్లీన్ చేయొచ్చు:

అవును మురికిగా అయిన కార్పెట్ ను వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించి చాలా తొందరగా, సింపుల్ గా క్లీన్ చేయొచ్చు. వాక్యూమ్ క్లీనర్ కార్పెట్‌లో ఉన్న దుమ్మును, ధూళిని, మట్టిని, మురికిని సులభంగా పోగొడుతుంది. మీరు గనుక వారానికి రెండు సార్లు కార్పెట్ ను వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేస్తే కొత్తదానిలాగే కనిపిస్తుంది. అలాగే దీన్ని తరచుగా ఉతకాల్సిన అవసరం కూడా రాదు. అలాగే కార్పెట్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. తొందరగా మురికిగా కాదు. 

ఇది కూడా చదవండి: ఈ ఒక్కదాన్ని పెట్టినా.. నల్లని మెడ తెల్లగా అవుతుంది

బేకింగ్ సోడా & వెనిగర్ తో శుభ్రం:

బేకింగ్ సోడా, వెనిగర్ తో కూడా మీరు కార్పెట్ ను చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఈ రెండూ కార్పెట్‌లోని మొండి మరకలను చాలా ఈజీగా తొలగిస్తాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా బేకింగ్ సోడా, వెనిగర్ రెండింటిని బాగా కలపండి. దీన్ని కార్పెట్ కు రాసి 15 నిమిషాలు అలాగే ఉంచి బ్రష్‌తో రుద్ది శుభ్రం చేయండి. ఇలా చేస్తే కార్పెట్ లోని మురికి, మొండి మరకలు సులువుగా పోతాయి. కార్పెట్ నుంచి దుర్వాసన కూడా రాదు. 

ఇది కూడా చదవండి:  ఈ ఒక్క ఆకుతో.. ఇంట్లో చెద పురుగులు లేకుండా పోతాయి

Carpet Cleaning Tips at Home rsl

స్టెయిన్ రిమూవర్ స్ప్రే వాడండి:

మీ కార్పెట్‌పై కాఫీ, టీ, చాక్లెట్ లేదా ఇతర మరకలు ఉన్నట్టైతే వాటిని పోగొట్టడానికి మీరు స్టెయిన్ రిమూవర్ స్ప్రేను వాడండి. ఇది ఎంతటి మొండి మరకనైనా ఇట్టే సులువుగా పోగొడుతుంది. 

ముఖ్య గమనిక:

అయితే మీరు కార్పెట్ ను పై పద్దతుల్లో ఎలా శుభ్రం చేసినా.. శుభ్రం చేసిన తర్వాత ఖచ్చితంగా ఎండలో ఆరబెట్టాలి. ఒకవేళ ఎండలేకపోతే గాలికైనా సరే ఆడబెట్టాలి. ఎందుకంటే కార్పెట్‌లో తేమ ఉంటే దుర్వాసన వస్తుంది. అలాగే ఈ తేమ వల్ల కార్పెట్ పై మరకలు ఏర్పడతాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios