MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • ఈ ఒక్కదాన్ని పెట్టినా.. నల్లని మెడ తెల్లగా అవుతుంది

ఈ ఒక్కదాన్ని పెట్టినా.. నల్లని మెడ తెల్లగా అవుతుంది

ఆడవాళ్లు ముఖం పై చూపే ఇంట్రెస్ట్ మెడపై పెట్టరు. దీనివల్లే మెడ మిగతా చర్మం కంటే నల్లగా మారుతుంది. కానీ దీనివల్ల మీరెంత బాగా రెడీ అయినా.. అందంగా మాత్రం కనిపించరు. అందుకే ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 03 2025, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆడవాళ్లు అందంగా కనిపించడానికి, నీట్ గా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు చర్మ సంరక్షణ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. కానీ ముఖం చర్మాన్ని పట్టించుకున్నంత మెడ చర్మాన్ని పట్టించుకోరు. దీనివల్ల ముఖం తెల్లగా ఉన్నా.. మెడ మాత్రం మిగతా చర్మం కంటే కాస్త నల్లగా కనిపిస్తుంటుంది. దీన్ని అలాగే వదిలేస్తే అది మరింత నల్లగా మారిపోతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొంతమంది పార్లర్ వెళితే.. మరికొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోతుంటారు. కానీ నల్లని మెడ అందాన్ని మాత్రం తగ్గిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
dark neck

dark neck

మెడ నల్లగా ఉండటానికి గల కారణాలు 

ఒక్క ఆడవారికి మాత్రమే కాదు కొంతమంది పురుషుల మెడ కూడా శరీరంలో మిగతా చర్మం కంటే కాస్త నలుపులో ఉంటుంది. దీన్ని 'అకాంథోసిస్ నైగ్రికాన్స్' అంటారు. నిపుణుల ప్రకారం.. మెడ నల్లగా కావడానికి ఊబకాయం ఒక ప్రధాన కారణం. 

ఇకపోతే  ఆడవారిలో ఈ సమస్యకు కొన్ని కారణాలు ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్, శారీరక శ్రమ వంటి కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంది. అలాగే కొంతమందికి సుగంధ ద్రవ్యాలు, హెయిర్ డై లకి అలెర్జీల  ఉంటే కూడా మెడ రంగు నలుపు రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

35
<p>ಆದರೆ &nbsp;ಚಿಂತಿಸಬೇಡಿ! ನೀವು ಮಾಡಬೇಕಾಗಿರುವುದು ನಿಮ್ಮ ಅಡುಗೆಮನೆಗೆ ಹೋಗಿ ಮತ್ತು ಕೆಲವು ಮನೆಮದ್ದುಗಳನ್ನು ತಯಾರಿಸಿ. ಆ ಮೂಲಕ ಕುತ್ತಿಗೆಯ ಕಪ್ಪು ಬಣ್ಣವನ್ನು ಮಾಯಮಾಡಿ...&nbsp;</p>

<p>ಆದರೆ &nbsp;ಚಿಂತಿಸಬೇಡಿ! ನೀವು ಮಾಡಬೇಕಾಗಿರುವುದು ನಿಮ್ಮ ಅಡುಗೆಮನೆಗೆ ಹೋಗಿ ಮತ್ತು ಕೆಲವು ಮನೆಮದ್ದುಗಳನ್ನು ತಯಾರಿಸಿ. ಆ ಮೂಲಕ ಕುತ್ತಿಗೆಯ ಕಪ್ಪು ಬಣ್ಣವನ್ನು ಮಾಯಮಾಡಿ...&nbsp;</p>

నల్లని మెడను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

కస్తూరి పసుపు ప్యాక్

మెడపై ఉన్న నలుపు రంగును వదిలించుకోవడానికి కస్తూరి పసుపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ముందుగా ఈ పసుపును మీడియం మంట మీద వేయించాలి. ఇది బంగారు రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పసుపును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా తేనె, పెరుగు, కాఫీ పొడి, నిమ్మరసం వేసి బాగా కలగలపండి.

అయితే ఈ ప్యాక్ ను ఉపయోగించే ముందు మీ మెడను నీట్ గా సబ్బు లేదా టమాటా చక్కెరతో స్క్రబ్ చేయాలి. దీనివల్ల మీ మెడ క్లీన్ అవుతుంది. ఇప్పుడు పసుపు ప్యాక్ ను మెడ  చుట్టూ అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఇలా మీరు గనుక వారానికి 3 రోజులు చేస్తే మీ మెడ నలుపు పూర్తిగా తగ్గుతూ వస్తుంది. 

45
dark neck

dark neck

నిమ్మకాయ, బేకింగ్ సోడా

మెడ నలుపును పోగొట్టడానికి నిమ్మకాయ, బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం కొంచెం బేకింగ్ సోడా తీసుకుని అందులో పసుపు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని మెడకు రాయండి. ఈ ప్యాక్ ను తరచుగా ఉపయోగిస్తే మెడ నలుపు క్రమంగా తగ్గుతుంది. 

పాలు, తేనె
 
పాలు, తేనెతో కూడా మీరు నల్లగా ఉన్న మెడను తిరిగి నార్మల్ రంగులోకి తీసుకురావొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కొన్ని పాలను తీసుకుని అందులో నిమ్మరసం, తేనె వేసి కలిపి ప్యాక్ చేయండి. దీన్ని మెడకు బాగా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివల్ల మెడ నలుపు పూర్తిగా తగ్గుతుంది. 

55

మెడ నలుపు పోవాలంటే  ఇవి చేయాల్సిందే:

మెడపై నలుపు రంగు పోవాలంటే మాత్రం మీరు ఆయిలీ స్నాక్స్ ను తినకూడదు. 
మసాలా ఆహారాల జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే ఇవి ఊబకాయానికి దారితీస్తాయి. దీంతో మీ మెడ ముదురు రంగులోకి మారుతుంది. 

అయితే హార్మోన్ల మార్పులు, పీసీఓఎస్  వల్ల కూడా మెడ నల్లగా మారుతుంది. కాబట్టి పైన చెప్పిన ఇంటి చిట్కాలను ఫాలో అవ్వడానికి ముందు సరైన ట్రీట్ మెంట్ తీసుకోవడం మంచిది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved