Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబు వస్తేనే చెట్టు దిగుతా... (వీడియో)

విజయవాడలో మతిస్థిమితం లేని ఒక యువతి హల్చల్ చేసింది. పోలీసులను ఫైర్ సేఫ్టీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అగ్రిగోల్డ్ బిల్లింగ్ ఎదురుగా ఉన్న చెట్టు ఎక్కింది. అప్పటివరకు అక్కడే కూర్చుని ఉన్న ఆ మహిళ ఒకేసారి ఇలా చేయడంతో స్థానికులు కంగారుపడి కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహిళా మిత్ర పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్టు ఎక్కిన మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

మహేష్ బాబు రావాలని, మోడీతో మాట్లాడాలని, జగన్ నా మొర వినాలని ఏవేవో మాట్లాడింది.  చివరికి ఎలాగో ఆమెను ఫైర్ సిబ్బంది సాయంతో కిందికి దించారు. తాను కలకత్తా నుంచి రైళ్లో వచ్చానని, ఇక్కడ తనకు మోసం జరిగిందని చెబుతోంది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Video Top Stories