video : ఎమ్మార్వో కార్యాలయల వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లోని ఎమ్మార్వో కార్యాలయల వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. సామూహిక వినతి పత్రాల సమర్పణలో భాగంగా ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయలను ప్రకటించాలని ఎమ్మార్వో కార్యాలయల ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకక, కూలి పనిలేక రోడ్ల మీద పడ్డామని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

First Published Oct 21, 2019, 5:58 PM IST | Last Updated Oct 21, 2019, 5:58 PM IST