ప్రొఫెసర్ జయశంకర్ నే మోసం చేసిన 420 ఈ కేసీఆర్..: షర్మిల సంచలనం

వరంగల్ :  తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినగడ్డ పరకాల నియోజకర్గాన్ని అభివృద్ది చేస్తానన్న కేసీఆర్ ఏమయినా చేసారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 
 
Share this Video

వరంగల్ : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినగడ్డ పరకాల నియోజకర్గాన్ని అభివృద్ది చేస్తానన్న కేసీఆర్ ఏమయినా చేసారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 
జయశంకర్ మృతి తర్వాత ఆయన పేరు చిరకాలం గుర్తిండిపోయేలా స్వగ్రామంలో స్మృతివనం, అందరికీ అందుబాటులో వుండేలా లైబ్రరీ ఏర్పాటుచేస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పాడే... తెలంగాణ రాష్ట్రానికే ఆ గ్రామాన్ని ఆదర్శంగా చేస్తానని అన్నాడుగా... చేసిండా? అని షర్మిల అడిగారు. తెలంగాణ వచ్చి ఎనిమిద్దరేళ్లే అయ్యింది కదా... జయశంకర్ గారి గ్రామం ఆదర్శగ్రామం అయ్యిందా? అని ప్రశ్నించారు. కనీసం మంచినీళ్ల సదుపాయం లేదు... రోడ్లు సరిగ్గా లేవు.. అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాటయినా నిలబెట్టుకున్నాడా అంటూ మండిపడ్డారు. తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ కు గుర్తుగా ఇచ్చిన హామీలనే మరిచాడంటే కేసీఆర్ ను ముఖ్యమంత్రి అనాలా, మోసగాడు అనాలా... 420 అనాలా అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. 

Related Video