శవ రాజకీయాలొద్దు... : పరామర్శకు వెళ్లిన షర్మిలకు నవీన్ కుటుంబం షాక్

సిరిసిల్ల :టిఎస్ పిఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై వివాదం కొనసాగుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. 

Share this Video

సిరిసిల్ల :టిఎస్ పిఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై వివాదం కొనసాగుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ఆత్మహత్య  చేసుకున్న నవీన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురయ్యింది. తమ బిడ్డ ఆత్మహత్యతో రాజకీయం చేయవద్దని నవీన్ తండ్రి పరామర్శకు వచ్చినవారి ముఖంమీదే చెప్పేసాడు. నవీన్ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించలేదని... గ్రూప్ 1 కు దరఖాస్తు కూడా చేయలేదని అతడి బాబాయ్ తెలిపాడు. పేపర్  లీకేజీ వ్యవహారంతో  తమ బిడ్డ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రచారం తగదని...  కొడుకు చనిపోయి బాధలో వున్న తమకు ఇలాంటి వార్తలు మరింత బాధిస్తున్నాయని అన్నారు. ఈ పరిణామంతో పరామర్శకు వచ్చిన షర్మిల, జీవన్ రెడ్డి సైలెంట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. 

Related Video