Agnipath Row : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లతో ఎన్ఎస్యూఐకి సంబంధం లేదు..: బల్మూరి వెంకట్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు కొనసాగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్ యూఐ కారణమంటూ వార్తలు వెలువడుతున్నాయి. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ప్రకటించారు.
అగ్నిపథ్ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడంతో 48 గంటల్లో 44 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వెంకట్ తెలిపారు. ఆ బాధ, ఆవేదనతోనే విద్యార్థులు సికింద్రాబాద్ లో ఆందోళకు దిగారు... అంతేకానీ ఈ ఘటనతో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలకు సంబంధం లేదన్నారు. సికింద్రాబాద్ అల్లర్లకు ఎన్ఎస్ యూఐ కారణమంటే వచ్చిన వార్తలను ఖండిస్తున్నామని వెంకట్ అన్నారు. సామాన్య ప్రయాణికులను ఇబ్బందిపెట్టేలా ఎవరూ వ్యవహరించకూడదని... అలా ఎవరైనా కనిపిస్తే అడ్డుకోడానికి ప్రయత్నించలని ఎన్ఎస్ యూఐ శ్రేణులకు వెంకట్ సూచించారు.