బాసరలో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి...

ప్రసిద్ద పుణ్య‌క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 

Share this Video

ప్రసిద్ద పుణ్య‌క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో ఆలయం భక్తజనసంద్రంగా మారింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి కుటుంబ స‌మేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమ‌ర్పించారు. అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఆల‌య అధికారులు, త‌దిరులు ఉన్నారు

Related Video