Asianet News TeluguAsianet News Telugu

టిఫిన్ సెంటర్ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వివాదం... పరస్పర దాడులు...

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఫైవింక్లైన్ ఏరియా చౌరస్తా వద్ద ఈరోజు తెల్లవారుజామున కొందరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 

First Published May 27, 2023, 1:56 PM IST | Last Updated May 27, 2023, 1:56 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఫైవింక్లైన్ ఏరియా చౌరస్తా వద్ద ఈరోజు తెల్లవారుజామున కొందరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్ వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగి పరస్పర దాడులకు పాల్పడ్డారు. గోదావరిఖనికి చెందిన కొంతమంది యువకులు హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చిన యువకులు టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న కొంతమంది యువకులు మధ్య జరిగిన చిన్నపాటి విషయానికి గొడవకు దారి తీసినట్టు తెలిసింది. దీంతో హోటల్‌లో ఉన్న సామాగ్రితో ఇరువర్గాలు రక్త గాయాలు అయ్యేవరకు కొట్టుకున్నారు. అంతేకాకుండా ఆ పక్కన ఉన్న ఏటీఎంలో అద్దాలను పగలగొట్టారు. ఇదంతా కొంతసేపు భయానక వాతావరణన్ని సృష్టించింది. గాయాల పాలైన యువకులు గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.