అమరవీరులకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి నివాళి
హైదరాబాద్ : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ్నుంచి నామినేషన్ వేయడానికి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయల్దేరారు. సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ బీ ఫార్మ్ అందజేసిన విషయం తెలిసిందే. గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మహేశ్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.