కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయండన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే... వీడియో వైరల్

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

First Published Feb 26, 2021, 9:48 AM IST | Last Updated Feb 26, 2021, 9:48 AM IST

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సిఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని కోరాడు. వెంటనే తప్పు తెలుసుకుని టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని సరిచేసుకున్నాడు. అయితే అతడు తడబడుతూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.