కడియంకు బిజెపి గాలం: గులాబీ గూటిలో చిచ్చు (వీడియో)
ఈటెల రాజేందర్ చేసిన పార్టీకి ఓనర్ అనే కామెంట్ తో తెలంగాణాలో రాజకీయ వాతావరణం ఎన్నికలు లేకున్నా వేడెక్కింది. చాలా సౌమ్యంగా కనపడే ఈటెల ఇంత బాహాటంగా కార్యకర్తల సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఈటెల రాజేందర్ చేసిన పార్టీకి ఓనర్ అనే కామెంట్ తో తెలంగాణాలో రాజకీయ వాతావరణం ఎన్నికలు లేకున్నా వేడెక్కింది. చాలా సౌమ్యంగా కనపడే ఈటెల ఇంత బాహాటంగా కార్యకర్తల సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. అసంతృప్త స్వరం వినపడగానే, తమపార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా రెడీమేడ్ నాయకుల కోసం వెదుకుతున్న బీజేపీ ఈటెలను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని మైండ్ గేమ్ మొదలుపెట్టింది. కెసిఆర్ కాబినెట్ విస్తరణ ఏర్పాట్లలో ఉన్న నేపథ్యంలో అసమ్మతి గొంతుకలు మరిన్ని వినిపించే ఆస్కారం ఉంది.