Asianet News TeluguAsianet News Telugu

హైదరబాదీలకు కారు రేసింగ్ కష్టాలు... హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ నెల (ఫిబ్రవరి) 11వ తేదీ నుండి జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ కు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ నెల (ఫిబ్రవరి) 11వ తేదీ నుండి జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ కు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ రేసింగ్ కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కి.మీ ట్రాక్ ఏర్పాటుచేసారు. అయితే ముందుస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే హుస్సెన్ సాగర్ చుట్టూ రేసింగ్ జరిగే మార్గాల్లో  ట్రాఫిక్ ను నిలిపివేసారంటూ హైదరబాదీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రోడ్లను మూసివేయడంతో నిత్యం ఆ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు బారీకేడ్లను తోసుకుని ముందుకు వెళుతున్నారు. మీ రేసింగుల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.