Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం... ఆటో ఎంత విచిత్రంగా బోల్తాపడిందో చూడండి..!

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తోంది దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. 

First Published Aug 24, 2023, 2:51 PM IST | Last Updated Aug 24, 2023, 2:51 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తోంది దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. రాయదుర్గంలోని ఈ కేబుల్  బ్రిడ్జిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బ్రిడ్జిపైనే బోల్తా పడిపోయింది. దీంతో ఆటోడ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదానికి సంబంధించిన సిసి ఫుటేజిని పోలీసులు విడుదల చేసారు. ముందు వెళుతున్న బైక్ ను ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పిన ఆటో బోల్తాపడింది. గాయాలపాలైన క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.