Asianet News TeluguAsianet News Telugu

గోదావరిఖని పట్టణంలోని ఇళ్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని బాపూజీ నగర్ పరిసర ప్రాంతాలలో వన్ టౌన్ పోలీసులు శనివారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  

First Published Aug 26, 2023, 1:10 PM IST | Last Updated Aug 26, 2023, 1:10 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని బాపూజీ నగర్ పరిసర ప్రాంతాలలో వన్ టౌన్ పోలీసులు శనివారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  వన్ టౌన్ సీఐ లు ప్రమోదరావు, ప్రసాద్ రావు 50 మంది పోలీసు సిబ్బందితో పాల్గొని ఇళ్లిల్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను, 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీవాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసమే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా పిల్లలు గంజాయి వంటి నిషేధిత వాటికి అలవాటు పడకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.