పుట్టినరోజుకు డబ్బులు ఇవ్వలేదని.. బాలుడు ఆత్మహత్య..
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో విషాదం చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకలకు తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో ఓబాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండంపల్లి గ్రామానికి చెందిన మేకల విజయ, నర్సయ్య దంపతుల కుమారుడు నివాస్ టెన్త్ పాసయ్యాడు. రేపు బర్త్ డే కావడంతో తల్లి ని పదివేలు అడిగాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన నివాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటికి వెళ్లిన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి శవమైకనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.