
Deputy CM Bhatti Vikramarka: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్
గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) పథకం ద్వారా రాష్ట్రంలో 52.82 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని శాసనమండలిలో తెలిపారు. SPDCL పరిధిలో 25,35,560 కుటుంబాలు, NPDCL పరిధిలో 27,46,938 కుటుంబాలు ఈ పథకం ద్వారా లాభం పొందుతున్నట్లు వివరించారు.