Asianet News TeluguAsianet News Telugu

శాసనమండలి ఛైర్మన్ కు బడ్జెట్ ప్రతులు అందించిన మంత్రి హరీష్

తెలంగాణ బడ్జెట్ 2023-24 ను శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. 

తెలంగాణ బడ్జెట్ 2023-24 ను శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం ఇంటి నుండి నేరుగా జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న ఆర్థిక మంత్రి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో కలిసిన బడ్జెట్ ప్రతులను అందజేసారు. మరికొద్దిసేపట్లో అంటే
10.30 నిమిషాలకు శాసన సభ లో హరీష్, శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా హరీష్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి.