Asianet News TeluguAsianet News Telugu

క్వశ్చన్ పేపర్ల లీకేజీపై బిఎస్పీ సీరియస్... టిఎస్ పిఎస్సీ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్ :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) కార్యాలయాన్ని బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకులు ఇవాళ ముట్టడించారు. 

హైదరాబాద్ :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) కార్యాలయాన్ని బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకులు ఇవాళ ముట్టడించారు. నిరుద్యోగుల జీవితాలతో టీఎస్ పిఎస్సి చెలగాటం ఆడుతోందని... ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతీయువకులను ప్రశ్నపత్రాల లీకేజీ కలవరపెడుతోందని బిఎస్పీ నాయకులు ఆరోపించారు.ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన   నిందితులను కఠినంగా శిక్షించాలని బిఎస్పీ నాయకులు డిమాండ్ చేసారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిఎస్పీ నాయకులు టిఎస్ పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు.దీంతో పోలీసులు బిఎస్పీ శ్రేణులను అరెస్ట్ చేసారు.