#Prajasangramayatra:కేటీఆర్ ఇలాకాలో బండి సంజయ్ పాదయాత్ర షురూ

సిరిసిల్ల: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు చేరింది. 

First Published Sep 23, 2021, 4:48 PM IST | Last Updated Sep 23, 2021, 4:48 PM IST

సిరిసిల్ల: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మొదలయ్యింది. కామారెడ్డి జిల్లానుండి సిరిసిల్లకు పాదయాత్ర చేరుకోవడంతో జిల్లా నాయకులు రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. గంభీరావుపేట మండలంలో 13 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరుగనుంది. మొత్తంగా సిరిసిల్ల జిల్లాలో 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు 5 రోజుల పాటు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.