ఆర్టిసి బస్సులో చెలరేగిన మంటలు ... 40మందికి తృటిలో తప్పిన ప్రమాదం

విజయవాడ : ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Share this Video

విజయవాడ : ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరక్కముందే బస్సులోంచి ప్రయాణికులను కిందకు దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విజయవాడ నుండి గుడివాడకు 40మంది ప్రయాణికులతో ఆర్టిసి పల్లెవెలుగు బస్సు బయలుదేరింది. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు అంతకంతకు మరింత పెరిగి బస్సు మొత్తాన్ని వ్యాపించాయి. అప్పటికే ప్రయాణికులంతా బస్సులోంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో భారీగా మంటలు రావడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

Related Video