గుడారాలు వేసుకుని కుటుంబాలతో నివాసం... కరీంనగర్ లో దొంగల ముఠా అరెస్ట్
కరీంనగర్: గుడారాలు వేసుకుని నివాసముంటూ రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ జిల్లాలో టాస్క్ ఫోర్స్, ఎల్ఎండి పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్: గుడారాలు వేసుకుని నివాసముంటూ రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ జిల్లాలో టాస్క్ ఫోర్స్, ఎల్ఎండి పోలీసులు అరెస్ట్ చేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో గుడారాలు వేసుకుని ఉంటున్న కుటుంబాల కదలికపై అనుమానం రావడంతో నిఘా వుంచిన పోలీసులు దొంగలముఠాగా గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున వెండి, సెల్ ఫోన్ లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.