ఘోర రోడ్డుప్రమాదం... ఇద్దరు ఒగ్గు కళాకారులు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముస్తాఫా నగర్ లో ఇద్దరు ఒగ్గు కళాకారుల ఒగ్గు కథ చెప్పి ఇంటికి తిరిగి వెళుతుండగా రెండు బైకులు పరస్పరం తాకడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు కళాకారులు మృత్యువాతపడ్డారు. మృతులు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల దేవయ్య, నామపూర్ గ్రామానికి చెందిన గడ్డి అడవయ్య గా గుర్తించారు.