అల్వాల్ లో రేవంత్ పట్టణ గోస ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పట్టణ గోస కార్యక్రమాన్ని తన నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ నుంచి ప్రారంభించారు.
పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పట్టణ గోస కార్యక్రమాన్ని తన నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలలో లబ్ధిదారులు ఉంటే కేవలం వందలలోనే ఇల్లులు ఇచ్చారని మండిపడ్డారు. అసలు వాటి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేసారు . పట్టణ సమస్యలపై ప్రబుత్వానికి చిత్తశుద్ధి లేదని మహిళలు ఎదుర్కొంటున్న మరుగుదొడ్ల సమస్య తానే తీర్చుతానని రేవంత్ హామీ ఇచ్చారు . గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. పార్టీ తీసుకున్న కార్యక్రమం కాకపొవడంతో విమర్శలు రాకుండా తన అనుచరులతో మాత్రమే పాల్కొన్నాడు