Asianet News TeluguAsianet News Telugu

నడిరోడ్డుపై ప్రైవేటు బస్సు దగ్ధం..బస్సులో 26మంది ప్రయాణీకులు...

Mar 13, 2020, 1:43 PM IST

సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురంలోని నాగులమ్మ గుడి దగ్గర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సు దగ్ధమయ్యింది. డ్రైవర్ సమయస్ఫూర్తివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రయాణీకుల సామాను మొత్తం మంటల్లో కాలిపోయింది. ప్రమాదం సమయంలో బస్సులో 26మంది ఉన్నట్లు డ్రైవర్ అనీల్ రెడ్డి చెబుతున్నాడు.