రోడ్లపై ఎర్రటి అన్నంముద్దలు... పెద్దపల్లిలో క్షుద్రపూజల కలకలం
పెద్దపల్లి : పంటపొలాల్లో, రోడ్లపై కుంకుమ కలిపిన ఎర్రటి అన్నంముద్దలు, నిమ్మకాయలు చూసి పెద్దపల్లి వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
పెద్దపల్లి : పంటపొలాల్లో, రోడ్లపై కుంకుమ కలిపిన ఎర్రటి అన్నంముద్దలు, నిమ్మకాయలు చూసి పెద్దపల్లి వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. రాత్రుళ్లు క్షుద్ర పూజలు చేస్తున్న తాంత్రికులు వస్తువులను అక్కడే వదిలి వెళుతుండటంతో ఉదయం వాటిని చూసి ప్రజలు భయపడిపోతున్నారు. ఇలా సుల్తానాబాద్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వంతెనపై నిత్యం క్షుద్రపూజల కోసం ఉపయోగించిన వస్తువులు కనిపిస్తున్నాయి. పసుపు, కుంకుమతో కూడిన అన్నంముద్దలు, కోడిగుడ్డు, నిమ్మకాయలు, మద్యం సీసాలను చూసి పొలాలకు వెళ్ళేవారు భయపడుతున్నారు.