RRR మూవీ కోసం కరీంనగర్ లో తోపులాట... ఎన్టీఆర్ అభిమానులపై థియేటర్ సిబ్బంది దాడి

కరీంనగర్: భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన RRR మూవీ ఇవాళ విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 

Share this Video

కరీంనగర్: భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన RRR మూవీ ఇవాళ విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తేజ్ అద్భుత నటన, అపజయమన్నదే ఎరుగని స్టార్ డైరెక్టర్ రాజమౌళి విజువల్ వండర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా కరీంనగర్ లోని మమత థియేటర్ వద్ద భారీగీ అభిమానులు గుమిగూడటంతో తోపులాట చోటుచేసుకుంది. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తోపులాట చోటుచేసుకుందని... సిబ్బంది ఫాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించి కొట్టారని జిల్లా ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video