పదవుల కోసం వెంపర్లాడను, ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే....జూపల్లి (వీడియో)
టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని చెప్పుకొచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపల్లి పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని చెప్పుకొచ్చారు.