Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో బిజెపి జోరు... ఈటల రాజేందర్ సమక్షంలో భారీగా చేరికలు

మునుగోడు : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడంతో మునుగోడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

First Published Sep 26, 2022, 3:57 PM IST | Last Updated Sep 26, 2022, 3:57 PM IST

మునుగోడు : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడంతో మునుగోడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బిజెపి తరపున గెలిచి మరోసారి సత్తాచాటాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన నిత్యం ప్రజల్లో వుండటమే కాదు ఇతర పార్టీలు, కుల సంఘాల నాయకులను బిజెపి వైపు తిప్పుతున్నారు. ఇలా తాజాగా చౌటుప్పల్ కు చెందిన మత్స్యకార సంఘాల ప్రతినిధులను బిజెపి వైపు చూసేలా చేసారు. ఈ క్రమంలోనే ఇవాళ హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేతులమీదుగా కండువా కప్పించి మత్స్యకార సంఘాల నాయకులను బిజెపిలో చేర్చుకున్నారు రాజగోపాల్ రెడ్డి.