Asianet News TeluguAsianet News Telugu

యూరియా సమాచారం రైతులకు అందించాలి (వీడియో)

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రబీ సాగుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీకి అవసరమయిన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలన్నారు.

 గంగవరం, వైజాగ్, ట్యుటికోరిన్, కాకినాడ, కరైకల్, కృష్ణపట్నం పోర్టుల నుండి తెలంగాణకు వస్తున్న యూరియా గురించి మంత్రి ఆరా తీశారు.ఆయా జిల్లాలలో కొంతమంది ప్రజాప్రతినిధులతో సంప్రదించి అదనపు అవసరాలు ఉన్నాయా అనే విషయాలపై ఆయన ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూరియా స్టాక్స్ గురించి సమాచారాన్ని తెలుసుకోవాలని ఆయన అధికారులను కోరారు.

స్టాక్ పాయింట్లకు చేరుకున్న నిల్వల గురించి క్షేత్రస్థాయి అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

Video Top Stories