నవ నిర్మాణ బహిరంగ సభను సకలజనుల పాల్గొని విజయవంతం చేయాలి

ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 

First Published May 6, 2023, 5:03 PM IST | Last Updated May 6, 2023, 5:03 PM IST

ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.  ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ.. రామగుండం ప్రజల దశాబ్దాల కల ఆయన మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం తోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 8న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చందర్ తెలిపారు. అలాగే నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించిన అనంతరం సింగరేణి స్టేడియంలో నవనిర్మాణ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక వర్గంతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.