Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో ప్రోటోకాల్ వివాదం... మంత్రి శంకుస్థాపన చేసిన వెంటనే శిలాపలకం తొలగింపు

జగిత్యాల : ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై సీరియస్ అయిన మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన రోజే శిలాపలకాన్నే తీసేయించారు. 

First Published Jun 4, 2023, 2:31 PM IST | Last Updated Jun 4, 2023, 2:31 PM IST

జగిత్యాల : ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై సీరియస్ అయిన మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన రోజే శిలాపలకాన్నే తీసేయించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ఔషధ గిడ్డంగి, 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన చేసారు. అయితే శిలాపలకంపై ప్రోటో కాల్ ప్రకారం జడ్పీ చైర్ పర్సన్ పేరు లేకపోవడాన్ని గమనించిన మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే  శిలాఫలకాలను తొలగించి వాటి ప్లేస్ లో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో మంత్రి వెళ్ళిపోగానే అధికారులు శిలాపలకాన్ని తొలగించారు.