వేములవాడలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు (వీడియో)

తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈఓ, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు.

Share this Video

అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణవేణి రాజన్న చిత్రపటం, ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, తదితరులు ఉన్నారు.

Related Video