నాలుగు దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవల ప్రారంభం (వీడియో)

రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఆాలయాల్లో ఆన్ లైన్ సేవలను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి  , వరంగల్ భద్రకాళి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలలో T APP FOLIO,మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ సేవలను పొందవచ్చని మంత్రి చెప్పారు.

First Published Sep 4, 2019, 2:50 PM IST | Last Updated Sep 4, 2019, 2:52 PM IST

రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఆాలయాల్లో ఆన్ లైన్ సేవలను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి  , వరంగల్ భద్రకాళి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలలో T APP FOLIO,మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ సేవలను పొందవచ్చని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలోని మొత్తం 11 ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.భక్తులకు కొరియర్ ద్వారా ప్రసాదాన్ని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు.

హైదరాబాద్ బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మరో 4 ప్రధాన దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి