Asianet News TeluguAsianet News Telugu

వైద్య ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసిన మంత్రి...ఉత్తమ వైద్య సేవల్లో తెలంగాణకు మూడు స్థానం అని వెల్లడి...

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందిన "ఆరోగ్య శాఖ వార్షిక నివేదిక -2022" ను  ఈ రోజు  ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు విడుదల చేసారు. 
 

First Published Jan 29, 2023, 8:09 PM IST | Last Updated Jan 29, 2023, 8:09 PM IST

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందిన "ఆరోగ్య శాఖ వార్షిక నివేదిక -2022" ను  ఈ రోజు  ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు విడుదల చేసారు. 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
సీఎం కేసీఆర్‌ వైద్యరంగానికి  అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతిఆయోగ్‌ గుర్తించిందని, మాతా, శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న మూడో రాష్ట్రం కూడా తెలంగాణ అని చెప్పారు.
గడచినా ఏడాది రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయనిఅయన వెల్లడించారు. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వరంగల్‌లో రూ.11వందల కోట్లతో 2వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు పెరిగారని అలాగే 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్‌ కిట్స్‌ కూడా అందజేస్తున్నామని తెలిపారు.